prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:47 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు,దేశంలో,రాష్ట్రంలో మార్పు రావాలి,మార్పు కావాలి సిపిఐ ప్రతిజ్ఞ

పోరుమామిళ్ల ఆగస్టు 16 (ప్రజావాణి)తిరుపతి రెడ్డి కాలనీలో ఆగస్టు 15,80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యుడు సఫా అధ్యక్షతన సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో అర్ధరాత్రి ఒంటిగంటకు స్వేచ్ఛగా ఇంటికి మహిళా ఏ రోజు రాగలిగితే ఆరోజు స్వాతంత్రం వచ్చినట్లు అని వారన్నారు. అలాగే “దేశంలో మార్పు కావాలి–మార్పురావాలి అనే నినాదంతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా తీసుకెళ్లిందని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలోని నిరు పేద ప్రజలు ఇప్పటికీ నిరుపేదలు గానే ఉన్నారని అన్నారు.అనంతరం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని,భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక,ప్రజాస్వామిక,సామ్యవాద విలువలను రక్షించుకోవడానికి,దేశ ప్రజలందరికీ సాంఘిక,ఆర్థిక,సామాజిక,రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి,భావ ప్రకటన,స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేయించారు.దేశ స్వాతంత్రాన్ని, సమైక్యతను,సౌభ్రాతృత్వాన్ని సంరక్షించుకోవడానికి పునరంకితమవుతామని,మార్పు కావాలి–మార్పు రావాలి”అనే నినాదంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను,పాలకులు అనుసరిస్తున్న అనాలోచిత,నిర్ణయాల ను ఎండగట్టేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ప్రజా వ్యతిరేక నిర్ణయాలను,మతోన్మాద చర్యలను,ప్రైవేటీకరణ యత్నాలను తిప్పికొట్టేందుకు, ప్రజల మాన ప్రాణ,హక్కుల రక్షణ కోసం,శాంతి, సమానత,సామరస్యాన్ని పరిరక్షించేందుకు సిపిఐ సారథ్యంలో కమ్యూనిస్టులుగా ప్రజల తరఫున ఉద్యమిస్తామని అన్నారు.
అలాగే తిరుపతి రెడ్డి కాలనీ 12 సంవత్సరాలు నివాసం ఉన్నా పేదలకు ఇంటి పట్టాలు మౌలిక సదుపాయాలు మాకు కల్పించినాడు,మాకు స్వాతంత్రం వచ్చిందని పేదలన్నారు అనంతరం 80 వ స్వాతంత్ర దినోత్సవ కేకు కట్ చేసి,ప్రజలందరికీ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ,ఫిరోజ్,శాఖ కార్యదర్శి షాహిదా,బెల్లం బాషా,హసన్ వలి, విశ్వాసమ్మ,శ్రీనివాసులు,గురమ్మ,విష్ణు,బాలమ్మ,రంగాచారి,అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు