పోతన కాలనీలో గ్యాస్ లీకేజీ ఘటన.. గృహిణి మృతి

  గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యమే కారణమా? సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి గోదావరిఖని: ఆగస్టు 2న పోతన కాలనీలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనలో గృహిణి విజ్ఞత మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల భద్రత విషయంలో గ్యాస్ ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం...