prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:15 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారం ఐటీ కారిడార్‌ నూతన సీఐగా జగన్నాథ్….శుభాకాంక్షలు తెలిపిన ఘట్‌కేసర్ మండల సీనియర్ రిపోర్టర్లు

ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను ఘట్‌కేసర్‌ మండల సీనియర్‌ రిపోర్టర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్‌ను సీనియర్‌ రిపోర్టర్లు చిన్నపాక సంజయ్, బత్తుల ప్రభాకర్, గాదె యాదగిరి గౌడ్, వెంకట్‌ రెడ్డిలు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఐ జగన్నాథ్‌ సమర్థత, అంకితభావం కలిగిన అధికారిగా పేరొందారని కొనియాడారు. ఐటీ కారిడార్‌ వంటి కీలక ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానంతో బాధితులకు సత్వర న్యాయం అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. సమాజ హితం, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖకు విలేకరుల తరఫున ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్‌ రిపోర్టర్లకు సీఐ జగన్నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్‌ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, పోలీస్‌–పత్రికా రంగాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.