పోచారంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం…పార్టీ బలోపేతమే లక్ష్యం.. నూతన కమిటీలకు దరఖాస్తుల స్వీకరణ..
ఘట్‌కేసర్, ఆగస్టు 17 (ప్రజా వాణి): పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. చౌదరిగూడలోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో గల ఏబీ కన్వెన్షన్ హాల్‌లో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రే రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ జడ్పీ...