పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు…నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, ఆగస్టు 20 (ప్రజా వాణి): పేదవారి ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీకలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు మాలోత్ శాంతి ఆహ్వానం మేరకు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,...