ఘట్‌కేసర్, ఆగస్టు 20 (ప్రజా వాణి): పేదవారి ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీకలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు.
ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్, ఘనపురం గ్రామ పరిధిలోని పకీర్ టేక్య తండాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు మాలోత్ శాంతి ఆహ్వానం మేరకు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామల అమరేందర్, మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్, మాజీ ఉప సర్పంచ్ అకిటి సుధాకర్ రెడ్డి, మాజీ బ్యాంకు డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధం, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ కార్యదర్శి కవాడి మాధవ్ రెడ్డి, అంకుశపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గంగి శంకర్, మాజీ వార్డు సభ్యులు వడ్త్యా జైందర్ నాయక్, గుర్జకుంట నర్సింహ, మెట్టు రమేష్, నానావత్ సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు డొంకేన శంకర్ గౌడ్, బింగి రాజేందర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బత్తిని ప్రవీణ్ గౌడ్, పూస రమేష్, వడ్త్యా సురేష్ నాయక్, గడ్డం శ్రీనివాస్, మాలోత్ చిట్టిబాబు నాయక్, మాలోత్ సురేష్ నాయక్, ఖాట్రోత్ శ్రీకాంత్ నాయక్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
