prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:59 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

పేదల సంక్షేమ పథకాలు కొనసాగించాలని బీఆర్ఎస్ నిరసన

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

చండూరు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం చండూరు మండల కేంద్రం చౌరస్తాలో రాస్తారోకో నిరసన చేపట్టారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.