పేదల సంక్షేమమే కాంగ్రెస్
ప్రభుత్వ లక్ష్యం
తొర్రూరు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి
పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి
తొర్రూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. సోమవారం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని పేర్కొన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన, వార్డు కౌన్సిలర్లు ముద్దసాని సురేష్, వివిధ గ్రామ సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ మరియు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.