prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 12:50 pm Digital Edition : NAVEEN NADIKUDA

పేదరికాన్ని జయించి వైద్య వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగిన కౌకొండ గ్రామ బిడ్డ

కష్టాల నుంచి విజయ శిఖరాలకు డాక్టర్ చంద్రమోహన్

 

  • పేదరికాన్ని జయించి వైద్య వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగిన కౌకొండ గ్రామ బిడ్డ

ప్రజావాణి నడికూడా ఆగస్టు 9

కౌకొండ: సాధారణ కుటుంబంలో జన్మించి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటూనే చదువుపై ఉన్న ఆసక్తిని, లక్ష్యసాధనపై ఉన్న నమ్మకాన్ని వదలకుండా అంచెలంచెలుగా ఎదిగి నేడు వైద్య వృత్తిలో మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తి డాక్టర్ చంద్రమోహన్. కౌకొండ గ్రామానికి చెందిన ఆయన, కొమురయ్య–సుశీల దంపతుల కుమారుడు.

 

చిన్ననాటి నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, కష్టాలను తన లక్ష్యానికి అడ్డంకులుగా భావించలేదు. వాటినే విజయానికి మెట్లుగా మార్చుకుని పట్టుదలతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సాంఘిక సంక్షేమ పాఠశాల, జాకారం, ములుగు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించిన ఆయన, అనంతరం ఎంసెట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యాభ్యాసం వైపు అడుగులు వేశారు.

 

ఉన్నత విద్యతో పాటు వైద్య రంగంలో శిక్షణ కోసం వివిధ ప్రాంతాల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కేరళలో శిక్షణ పొందుతూ విలువైన అనుభవాన్ని సంపాదించిన ఆయన, అనంతరం వరంగల్‌లోని ఎంజీఎంలో శిక్షణ తీసుకుంటూ తన వైద్య నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు.

 

ప్రస్తుతం డాక్టర్ చంద్రమోహన్ మల్లారెడ్డి ఆసుపత్రిలో తన వృత్తి సేవలను కొనసాగిస్తున్నారు. పేదరికం, కష్టాలు, అనేక సవాళ్లను అధిగమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు మంచి స్థాయికి చేరుకున్న ఆయన విజయ ప్రస్థానం యువతకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

 

“కష్టాలు మనల్ని ఆపడానికి రావు… మనలోని శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తాయి” అనే మాటకు డాక్టర్ చంద్రమోహన్ జీవితం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

 

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి, కౌకొండ గ్రామం గర్వించదగ్గ వ్యక్తిగా నిలిచిన డాక్టర్ చంద్రమోహన్ మరెన్నో విజయాలు సాధించి, వైద్య రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామస్తులు, శ్రేయోభిలాషులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిసఆకాంక్షిస్తున్నారు.