పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి: ఏడుగురు అరెస్ట్
రూ. 14,730 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం.. అంతర్గాం పిఎస్‌కు నిందితుల అప్పగింత అంతర్గాం/పెద్దపల్లి ఆగస్టు8 ప్రజావాణి : డబ్బులు పందెంగా పెట్టి ఆడుతున్న పేకాట స్థావరంపై నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామంలో భారీగా డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో ఈ దాడి జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో, ఎస్‌ఐ...