పెరుమాల చెరువు అభివృద్ధికి కీలక ముందడుగు….ఇన్ఫోసిస్ సీఎస్‌ఆర్ నిధులతో త్వరలో పనుల ప్రారంభం – మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దనున్న ప్రణాళిక

ఘట్‌కేసర్: పోచారం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యుగేంధర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బాల్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా పెరుమాల చెరువు హద్దుల నిర్ధారణ (బౌండరీ ఫిక్సింగ్) ప్రక్రియతో పాటు అభివృద్ధి పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ సామాజిక బాధ్యత నిధుల సహకారంతో చెరువు అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పెరుమాల చెరువు సమీపంలోని ప్రసిద్ధ దేవాలయానికి ప్రతిరోజూ అధిక సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. చెరువు అభివృద్ధి పూర్తయిన అనంతరం ఈ ప్రాంతం ఘట్‌కేసర్ సర్కిల్‌లో మినీ...