బెజ్జంకి, ఆగస్టు 13 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది.బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఒగ్గు దామోదర్ చైర్మన్‌గా నియమితులయ్యారు.డైరెక్టర్లుగా చెట్టి రాజు, నూనె రాజేందర్,కట్ట స్వరూప, అద్దంకి నర్సింగం, గంగాధర రామచంద్రం, కెడిక అపర్ణ, బైర రాజేందర్, తుమ్మ సుధాకర్ రెడ్డి, మాషం శంకర్,లింగాల రామవ్వ, కొమ్మెర తిరుపతి, కుక్కల రాములు నియమితులయ్యారు.నూతన పాలకవర్గానికి గుగ్గిళ్ళ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం, పీఏసీఎస్ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.