పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు

లింగాపూర్‌లో భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లి బోనాలు ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని లింగాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లిని కొలుస్తూ మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు ఈ సందర్భంగా...