prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:01 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పాఠశాల విద్యార్థితో జాతీయ జెండా ఆవిష్కరణ: సూరారంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారంలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసంగ సామగ్రి, మిఠాయిలు పంపిణీ చేశారు. యూత్ అసోసియేషన్ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నాన్ని, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరును గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు మరియు ఉపాధ్యాయులు ఎంతగానో అభినందించారు.