పస్రా పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీ

.ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి. .శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీస్ పస్రా పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ గారు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని...