పస్రా ఎస్సై తాజుద్దీన్ కు ములుగు ఎస్పీ ప్రశంసా పత్రం
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)- ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్ పస్రా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్.కె. తాజుద్దీన్ గారి సేవలను ప్రశంసిస్తూ లెటర్ ఆఫ్ కమెండేషన్ జారీ చేశారు. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం. 14/2023 పోక్సో కేసులో అత్యంత నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు ఈ ప్రశంస లభించింది. ఈ కేసులో నిందితుడికి 2026 ఏప్రిల్ 30వ తేదీన 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. బాధితురాలికి...