పన్నూర్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ వినతి
ఆర్జీ-3 జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ చిందం మహేష్ రామగిరి/పెద్దపల్లి ఆగస్టు 25 ప్రజావాణి : రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్ మంగళవారం ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పన్నూర్ సెంటర్, శ్రీలంక క్వార్టర్స్ వద్ద ఉన్న సింగరేణి...