పత్రికా జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రధాన పత్రిక జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్ట్ పెద్ద వంగర మండల జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి పత్రిక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామంలో ఈ నెల 11న మంగళ వారం రాత్రి బోనాల పండగ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోటో ప్లెక్సీ ఏర్పాటు చేసుకోగా,కాంగ్రెస్ పార్టీ మరో వర్గం నాయకులు ఆ ప్లెక్సీని ధ్వంసం చేశారు.ఈ సమాచారం అందుకున్న ప్రధాన పత్రిక విలేఖరి కుమ్మరి రామ్మూర్తి ఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తుండగా ప్లెక్సీని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రిపోర్టర్ పై ఆకారణంగా దాడి చేసి ,రామ్మూర్తి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని ,భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. ఆదివారం రామ్మూర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించాడు.ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ నాపై అకారణంగా జరిగిన దాడిని ఖండిస్తున్నానని,ఇది కేవలం నా ఒక్కడి మీదనే జరిగిన దాడి కాదు యావత్తు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల మీద జరిగిన దాడి అని అభివర్ణించాడు. ఇలాంటి దాడి మూగలపై చట్టం కఠినంగా చర్యలు చేపట్టకపోతే పత్రిక స్వేచ్ఛకు జర్నలిస్టుల మనుగడకే పెను ప్రమాదం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నా మీద దాడికి పాల్పడిన కాంగ్రెస్ అరాచకం మూకలపై చట్టరీత్య కఠిన చర్య తీసుకోవాలని ,వారిని వెంటనే శిక్షించాలని, ఆయన ప్రభుత్వా
న్ని కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టు సంఘాలను కలుపుకొని దశల వారి ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా ఇలాంటి అరాచక మూకలపై కాంగ్రెస్ పార్టీ తక్షణమే నిర్ణయం తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు.