నేరాల నియంత్రణకు ‘సురక్ష నేత్ర’ కీలకం ” చీలాపూర్‌లో 10 సీసీ కెమెరాల ఏర్పాటు”సిసి కెమెరాలను ప్రారంభించిన -సిద్దిపేట అడిషనల్ డీసీపీ కుషాల్కర్
బెజ్జంకి, ఆగస్టు 12 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో ‘సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను సిద్దిపేట అడిషనల్ డీసీపీ కుషాల్కర్ ప్రారంభించారు.చీలాపూర్ గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప–భాస్కరచారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాధాన్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల...