prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:00 pm Digital Edition : SRIKANTH MULUGU

నేను సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం


.నార్లపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ డిఎస్పీ రవీందర్.

ములుగు జిల్లా ప్రతినిధి/ప్రజావాణి:-
ములుగు డీఎస్పీ ఎన్ రవీందర్ మంగళవారం తేదీ 18-08-2026న నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
రౌడీ కేడి ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సిబ్బందికి ఆదేశించారు.
దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందేలా చూడాలని సూచించారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించి 5S విధానాన్ని అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.
అదే సమయంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా నార్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ ప్రారంభించారు.
ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా తమ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
పోలీసులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పసర సీఐ దయాకర్ నార్లాపూర్ ఎస్.హెచ్.ఓ ఎస్. కమలాకర్ పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ సిబ్బంది డీఎస్పీ సూచనలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.