prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:27 pm Digital Edition : SRIKANTH MULUGU

నెలవారి నేర సమీక్ష నిర్వహించిన ములుగు ఎస్పీ

నెలవారి నేర సమీక్ష నిర్వహించిన ములుగు ఎస్పీ
.సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని ఆదేశం.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)*;-
ములుగు జిల్లా ఎస్పీ శ్రీ కేకన్ సుధీర్ రామ్నాథ్, ఐపిఎస్ 19.08.2026 న కాన్ఫరెన్స్ హాల్ లో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు.
విధుల్లో నిబద్ధత, పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.
కోర్టు కేసుల్లో సాక్షులకు సమన్లు సకాలంలో అందించి, నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్ లను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు.
నమోదైన కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు.
దొంగతనం, ఆర్థిక నేరాల్లో బాధితులకు పోగొట్టుకున్న సొమ్ము తిరిగి ఇప్పించేలా కృషి చేయాలన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మహిళలపై నేరాలను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ బెట్టింగ్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
యువత సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్ టీం పాల్గొన్నారు.