
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:
నల్లగొండ జిల్లా చండూరు మండల పి ఆర్ టి యు టి ఎస్ శాఖ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాధగోని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కళ్ళెం వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు అక్కెనపల్లి చంద్రయ్య, మహిళా అసోసియేట్ అధ్యక్షులు గాదే చంద్రకళ, ఉపాధ్యక్షులు వేముల సైదులు, మహిళా ఉపాధ్యక్షులు సింగికొండ విజయలక్ష్మి, కార్యదర్శులుగా విశ్వనాధుల పవన్ కుమార్, ఆవుల బిక్షం, మహిళా కార్యదర్శులుగా తండు సాయి శిరీష, కొప్పు సత్యవతి ఎన్నిక అయ్యారు. నూతన కార్యవర్గానికి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ… మండలంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ల నాయకత్వంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.