నిరాధార ఆరోపణలు సరికాదు: చింత క్రాంతి
మంత్రి సీతక్క, ఆమె కుమారుడు సూర్యపై గుంటూరు సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను యువజన కాంగ్రెస్ నాయకుడు చింత క్రాంతి ఖండించారు. ములుగు జిల్లా యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు సూర్య టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని, దానికి బెట్టింగ్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. బెట్టింగ్‌లకు ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. వ్యక్తిగత కక్షతో సీతక్క కుటుంబాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సూర్యపై ఆరోపణలు నిజమైతే గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద చర్చకు రావాలని...