మంత్రి సీతక్క, ఆమె కుమారుడు సూర్యపై గుంటూరు సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను యువజన కాంగ్రెస్ నాయకుడు చింత క్రాంతి ఖండించారు.
ములుగు జిల్లా యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు సూర్య టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని, దానికి బెట్టింగ్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు.
బెట్టింగ్‌లకు ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
వ్యక్తిగత కక్షతో సీతక్క కుటుంబాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
సూర్యపై ఆరోపణలు నిజమైతే గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద చర్చకు రావాలని సవాల్ చేశారు.
గుంటూరు నుండి వచ్చిన సతీష్ రెడ్డి లగ్జరీ కార్లు ఎక్కడివో ముందు లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
యువత కోసం పనిచేస్తున్న వారిపై బురదజల్లడం మానుకోవాలని కోరారు.
క్రీడా కార్యక్రమాలకు రాజకీయ రంగు పులిమొద్దని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.