prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 3:21 pm Digital Edition : RAJU NANGUNOOR

నంగునూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు

నంగునూరు, ఆగస్టు 31 (ప్రజావాణి):
నంగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఫిర్యాదులను సమర్పించారు.
ఈ సందర్భంగా భూ సమస్యలు, గృహ నిర్మాణం, ప్రభుత్వ పథకాలు, ఇతర సమస్యలకు సంబంధించి ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. ప్రజావాణిలో మొత్తం 10 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాస్, తహసీల్దార్‌ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఇందులో తహసీల్దార్‌ కార్యాలయానికి సంబంధించి 6, హౌసింగ్‌ శాఖకు 3, ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 1 ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యmలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.