ధర్మారం నూతన ఎస్‌ఐగా ఎంబడి శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ఎంబడి శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, నాయకులు, విలేకరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.