prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:19 pm Digital Edition : SRIKANTH MULUGU

దేశ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

దేశ యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు


సిపిఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి.సాంబశివ

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ప్రపంచంలోనే ఏ దేశానికి లేని యువ సంపద భారతదేశానికి ఉందని ఆయా యువతను సరైన పద్ధతిలో వినియోగించుకోవడంలో ఈ దేశ పాలకవర్గాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఈ దేశంలో కనీసం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పాలక ప్రభుత్వాల పై నిరసన వ్యక్తం చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 వసంతాలు అవుతున్న ఈ దేశంలో ఉన్న యువతకు కనీసం జీవనోపాధి కల్పించే ఉద్యోగం ఇవ్వలేక ఈ దేశపాలక ప్రభుత్వాలన్నీ పూర్తిగా విఫలమవుతున్నాయని ప్రధానంగా 2014 నుండి ఏకధాటిగా పరిపాలన చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ దేశ ప్రజా సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం అనేది లేకుండా ఈ దేశ యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ధన దాహానికి నిరుద్యోగయువత శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా ప్రోత్సహిస్తుందని అన్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని స్వచ్ఛంద సంస్థలకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఏజెన్సీల పేరుతో డిజిటల్ ఇండియా పేరుతో ఆర్ఎస్ఎస్ బిజెపి బజరంగ్దళ్ లాంటి సంస్థలకు చెందిన వ్యక్తులకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మొత్తం మత సంస్థలు గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంతటితో ఆగకుండా దేశ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించకుండా వారిని మతం పేరుతో పాకిస్తాన్ చైనా ల పేరుతో మాయ మాటలు చెబుతూ నిరుద్యోగ యువత మెదడులలో మతం మత్తు ఎక్కిస్తూ మత్తులో ముంచుతున్నారని దేశంలో యువకులంతా ఉద్యోగం ఉపాధి లేకపోయేసరికి మద్యానికి వ్యసనానికి గంజాయికి బానిసలై ఈరోజు దొంగతనం దోపిడీలు అత్యాచారాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని
ఈ దేశ యువశక్తిని ఉపయోగించుకొని దేశం అభివృద్ధి చెందడానికి కావలసిన కనీసం ప్రణాళిక ఈ దేశ బిజెపి పాలక ప్రభుత్వానికి లేదని ఎంతసేపటికి దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు తప్ప దేశానికి ఉపయోగపడే ఒక్క పని చేయడం లేదని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేరుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు తప్ప దాని నియమ నిబంధనలు గాని ఇప్పటివరకు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ గానీ విడుదల చేయలేదని అన్నారు ములుగు కేంద్రంగా బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆరు నెలలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు తప్ప ఈ సభ సందర్భంగా నే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ జాబ్స్ ఇచ్చారు తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏమీ లేదని 20000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుందని అన్నారు ఉపాధి కల్పించకపోవడం వల్లనే ఈ రాష్ట్రంలో యువత కూడా శ్రమ దోపిడీకి గురి అవుతూ కనీస వేతనాలు లేక చాలీచాలని వేతనాలతో అస్తవ్యస్తమైన కుటుంబ జీవనం గడుపుతున్నారని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని ఎన్నికల్లో గెలిచే వరకే యువశక్తిని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న గాని ఇంతవరకు ఉద్యోగాల ప్రస్తావన గాని నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోతుందని అన్నారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న యువ సంపదను ఉపయోగించుకోవడం కోసం ఒక పక్క ప్రణాళిక వేసి దేశంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యువతను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రత్నం రాజేందర్ తుమ్మల వెంకటరెడ్డి పొదిళ్ల చిట్టిబాబు జిల్లా కమిటీ సభ్యులు సో మల్లారెడ్డి గొంది రాజేష్ రత్నం ప్రవీణ్ ప్రజాసంఘాల నాయకులు కవిత రజిత సువర్ణ రాజు యువజన సంఘం నాయకులు కలవల రవీందర్ పిట్టల అరుణ్ విద్యార్థి సంఘం నాయకులు టి.యల్ రవి జన్ను దేవేందర్ గుగులోతు రమేష్ సాదు రాకేష్ చాగంటి రవితేజ బాలేశ్వర్ కొడపాక చంటి సాయి చరణ్ రాజేష్ స్టాలిన్ తదితరులు 50 మంది పాల్గొన్నారు