దేవాలయ,పార్కు స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలి
కబ్జాదారులను పార్టీల నుంచి సస్పెండ్ చేయాలి
ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు
తిరుమల మెడోస్ లో కబ్జా స్థలాలను పరిశీలించిన ఫెడరేషన్ బృందం
మేడిపల్లి ఆగస్ట్16(మన ప్రజావాణి)బోడుప్పల్ సర్కిల్ పరిధిలొని తిరుమల మెడోస్ కాలనీలోని సర్వే నంబర్ 215లో గల పార్కు, గుండి పోచమ్మ దేవాలయ స్థలాలపై అక్రమ కబ్జాలు, రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు డిమాండ్ చేశారు.కబ్జాలకు పాల్పడిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.ఆదివారం
తిరుమల మెడోస్ కాలనీలో ఫెడరేషన్ బృందంతో కలిసి సర్వే నంబర్ 215లోని స్థలాలను ఆయన పరిశీలించారు.పార్కు, దేవాలయానికి కేటాయించిన స్థలాలను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడిశెట్టి వెంకటేశ్వర్,ఏ. శ్రీనివాస్ గుప్తా వారి బంధువులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. స్థలాల అసలు స్వరూపం, కేటాయింపులు,రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నిజానిజాలు వెలుగులోకి తేవాలని అధికారులను కోరారు.ప్రజా ప్రయోజ నాలకు కేటాయించిన పార్కు,దేవాలయ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాపోలు రాములు అన్నారు.కబ్జాలకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని కోరారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తోపాటు స్థలాలను తిరిగి ప్రజా ప్రయోజనాలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఏడ్ల శ్రీనివాస్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శి యాదగిరి, శ్రీనివాస్‌గుప్తా,మధు సూదన్,వెంకటస్వామి,కాలనీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి,కాలనీవాసులు కుమారస్వామి,శివశంకర్, సతీష్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

