దీపధూప పథకం అమలు చేయాలని మెదక్ ఎంపీకి వినతి

దీపధూప పథకం అమలు చేయాలని మెదక్ ఎంపీకి వినతి మెదక్ జిల్లా, ఆగస్టు 23: మెదక్ జిల్లాలోని గిరిజన సేవాలాల్‌ జగదాంబ దేవాలయాల పూజారులు దీపధూప పథకం అమలు చేయాలని కోరుతూ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. గిరిజన తండాల్లోని సేవాలాల్‌ జగదాంబ దేవాలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్న పూజారులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ గిరిజన తండాల్లో సేవాలాల్‌ జగదాంబ దేవాలయాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. దేవాలయాల్లో...