prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:15 pm Digital Edition : RAKESH PEDDAPALLY

దివ్యాంగుల రైల్వే పాస్‌ల జారీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు వినతి

 

 

 

పెద్దపల్లి ఆగస్టు 24 ప్రజావాణి :

దివ్యాంగులకు రైల్వే పాస్‌లు జారీ చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ క్యాడర్ ఫౌండేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులకు రైల్వే పాస్‌లు జారీ చేసేందుకు అవసరమైన వైద్య ధ్రువీకరణ పత్రాలను అందించడంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా దివ్యాంగులకు రైల్వే పాస్‌లు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. దీనిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి, వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)కు లేఖ రాసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

దివ్యాంగుల ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పాస్‌ల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని క్యాడర్ ప్రతినిధులు కోరారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో క్యాడర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ జి. హరిబాబు, క్యాడర్ దివ్యాంగుల పాఠశాల కరస్పాండెంట్ గజ్జెల్లి సతీష్, క్యాడర్ వైస్ ప్రెసిడెంట్ రవి నేరుపాటి, క్యాడర్ రిసోర్స్ పర్సన్ ప్రతిక్ష తదితరులు పాల్గొన్నారు.