దివ్యాంగుల ఇళ్ల స్థలాలు కబ్జా…. ఏళ్లు గడుస్తున్నా న్యాయం అందడం లేదు: వీహెచ్ ఆవేదన
ఘట్‌కేసర్, ఆగస్టు 28 (ప్రజా వాణి): పేద దివ్యాంగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ మహేంద్రహిల్స్–పీహెచ్‌సీ కాలనీ ప్రాంతంలోని సర్వే నంబర్ 14లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేద, దివ్యాంగుల ఇళ్ల నిర్మాణం కోసం...