prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 10:27 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

త్యాగమూర్తుల ఫలితమే స్వాతంత్రo

  1. త్యాగమూర్తుల ఫలితమే స్వాతంత్య్ర
  2. బీర్కూర్: ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం లభించిందని బీర్కూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుర్గం సాయిలు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుర్గం సాయిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
    అనంతరం గౌరవ అధ్యక్షులు కొప్పుల గంగాధర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ భారత్ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
    ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నారాయణ గాంధీ, ప్రధాన కార్యదర్శి విట్టల్, కోశాధికారి సునీల్, కార్యవర్గ సభ్యులు నగేష్, బాలకృష్ణ, శ్రీనివాస్త దితరులు పాల్గొన్నారు.