తోకలపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం: వైభవంగా లక్ష కుంకుమార్చన, అన్నదానం

పోరుమామిళ్ల  ఆగస్టు 21 ప్రజావాణి మండలం, తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని తోకలపల్లి గ్రామంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత అంగరంగ వైభవంగా, కనులపండువగా జరిగింది. గ్రామంలోని ఆలయ ప్రాంగణాన్ని పచ్చటి తోరణాలు, రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం:ఈ వేడుకల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ప్రముఖ నాయకులు కాటసాని వెంకటరెడ్డి దంపతులు ముఖ్య...