prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 5:36 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూరు సహాయ కార్మిక శాఖ అధికారికి సన్మానం

తొర్రూరు సహాయ కార్మిక శాఖ అధికారికి సన్మానం

తొర్రూరు సహాయ కార్మిక శాఖ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన చల్ల వెంగమాంబ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) తొర్రూరు మండల కమిటీ అధ్యక్షుడు జమ్ముల శ్రీనివాస్, నాయకులు మార్క సాంబయ్య, దర్గయ్య,జిల్లా నాయకులు పేరుమండ్ల బాబు గౌడ్ పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కడ విధులు నిర్వహించినా అంకితభావంతో, నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి కార్మిక శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సమయానుసారంగా పరిస్థితులను అర్థం చేసుకుని అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సకాలంలో అందేలా కృషి చేయాలని జమ్ముల శ్రీనివాస్ కోరారు.