prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:29 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.92 లక్షల నిధులు, మంజూరు

*తొర్రూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.92 లక్షల నిధులు, మంజూరు*

పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనుల కోసం పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి కృషితో ఇటీవల రూ.92 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఈ శుభ సందర్భంగా నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసి తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ , డైరెక్టర్లు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.92 లక్షల నిధులు మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కృషితో మార్కెట్‌లో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయని, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిధులతో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకోనుందని, రైతులు తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చిన సమయంలో మెరుగైన వసతులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చేస్తున్న అభివృద్ధి పనులు భాగంగా,
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్ డైరెక్టర్లు, అచ్చి రెడ్డి, ప్రసాద్, గోపాల్ నాయక్, వెంకటాచారి, సామ రామూర్తి, రమేష్ నాయక్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.