తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తిరుపతి, ఆగస్టు 15: తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, అదనపు ఎస్పీలు శ్రీ శ్రీనివాసులు, శ్రీ కె. రవి మనోహర్ చారి,...