తాజా టిఫిన్స్‌లో పొంగలిలో పురుగులు!…..ఆహార నాణ్యతపై తీవ్ర ఆరోపణలు — చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్

ఘట్కేసర్, ఆగస్టు 25 (ప్రజావాణి): పేరులోనే ‘తాజా’.. కానీ ఆహార నాణ్యత మాత్రం అధ్వానంగా ఉందంటూ జోడిమెట్లలోని తాజా టిఫిన్స్‌పై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హోటల్‌లో కొనుగోలు చేసిన పొంగలిలో పురుగులు కనిపించాయని ఓ వినియోగదారు ఆరోపించారు. ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పొంగలిలో పురుగులు కనిపించడంపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, సమస్యపై సరైన వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు...