తలకు గాయమైతే నిర్లక్ష్యం వద్దు.. ప్రాణం పోవచ్చు!
తలకు దెబ్బ.. ప్రాణం మీదకు తెచ్చింది! 14 ఏళ్ల బాలుడికి అత్యవసర శస్త్రచికిత్స.. మృత్యువు అంచుల నుంచి బాలుడిని కాపాడిన యశోదా వైద్యులు..కోదాడ, ఆగస్టు 13/ ప్రజావాణి రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైనప్పుడు బయటకు గాయం కనిపించకపోయినా నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పుర్రె లోపల రక్తస్రావం జరిగి మెదడుపై ఒత్తిడి పెరిగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని తెలిపారు.సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 14 ఏళ్ల మల్లెబోయిన తేజ దురాజ్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. మూర్ఛ...