తడి–పొడి చెత్త వేరు చేయండి.. గ్రామపంచాయతీకి సహకరించండి! గ్రామ పరిశుభ్రతకు ప్రజల సహకారం తప్పనిసరి: సర్పంచ్, పాలకవర్గం

బెజ్జంకి, ఆగష్టు 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో వేయాలని సర్పంచ్, పాలకవర్గం సూచించారు.గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచి ట్రాక్టర్లకు అందించాలని కోరారు.గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.