డ్రైనేజీ కాలువలు లేక రోడ్లపై నిలిచిన వర్షపు నీరు

బద్వేల్ ఆగస్టు9(ప్రజావాణి)బద్వేల్ పురపాలక సంఘం పరిధిలోని తొట్టిగారిపల్లె గ్రామంలో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడంతో, నీరంతా ఇళ్ల ముందు, రోడ్లపైనే నిలిచిపోయి చెరువులను తలపిస్తోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి, గ్రామంలో జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు,...