డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
బద్వేల్(ఆగస్టు10 ప్రజావాణి) డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు,అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని,ఇందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి,నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు...