prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:57 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం. ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఫోటో జర్నలిస్టులకు అవార్డులు. రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జాతీయస్థాయి మీడియా ఎడిటర్ల చేతుల మీదుగా అవార్డు స్వీకరణ. ఫోటో జర్నలిజంలో ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల శ్రీనివాస్ గౌడ్‌కు పలువురి అభినందనలు