prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 10:20 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

డిజిటల్ క్రాప్ సర్వే ను పరిశీలించిన – అధికారులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సోమవారం చండూర్ మండలంలో ఏడిఏ వేణుగోపాల్ వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా అంగడిపేట గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే విధానంను పరిశీలించడం జరిగింది. అలాగే డి సి ఎస్ వాలంటరీ కి మరియు రైతులకు పంట నమోదు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితమైన డేటాను సేకరించి పంట పొలాల వద్దకు వెళ్లి ప్రతిపంటను కచ్చితంగా డి సి ఎస్ యాప్ లో నమోదు చేయాలని సూచించడం జరిగింది. అలాగే చండూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో వడ్డేపల్లి యాదయ్య అనే రైతు క్రాప్ డైవర్సిరికేషన్ లో భాగంగా తనకున్న 5 ఎకరాల పొలంలో ఒక ఎకరం ఎండుమిర్చి ఒక ఎకరం వరి మూడు ఎకరాలు పత్తి సాగు చేశారు. వారి పొలమును ఏడిఏ వేణుగోపాల్ సందర్శించి ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులలో పూర్తిగా వరి పంట కాకుండా ఇతర పంటలు సాగు చేస్తున్న వడ్డేపల్లి యాదయ్యను అభినందించి మరియు సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చండూర్ వ్యవసాయ అధికారి మల్లేష్ హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్, ఏఈఓ జగన్ వాలంటర్ వెంకన్న, రైతులు పాల్వాయి శేఖర్ రెడ్డి , నెట్టు రాములు మొదలగువారు పాల్గొనడం జరిగింది.