జైపూర్ ఠాణాను తనిఖీ చేసిన మంచిర్యాల డిసిపి
జైపూర్, ఆగస్టు 25, ప్రజావాణి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఠాణాకు చేరుకున్న డీసీపీకి ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.అనంతరం రిసెప్షన్ సెంటర్, సీసీటీఎన్‌ఎస్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ, క్రైమ్ రికార్డులను...