prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:27 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

జేకే ఫెన్నార్‌ కార్మికులు సీఐటీయూలో చేరిక

•జేకే ఫెన్నార్‌ కార్మికులు సీఐటీయూలో చేరిక

*కార్మికులకు అండగా సీఐటీయూ

పటాన్‌చెరు, ఆగస్టు 17 (ప్రజావాణి): జేకే ఫెన్నార్ పరిశ్రమకు చెందిన పలువురు కార్మికులు వివిధ యూనియన్ల నుంచి సీఐటీయూలో చేరారు. శ్రామిక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజయ్య, పి. పాండురంగారెడ్డి కార్మికులను సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. సీఐటీయూ ఉన్న చోట కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటాలు నిర్వహిస్తూ అనేక హక్కులు, సౌకర్యాలను సాధించామని తెలిపారు. ‘ఐక్యత–పోరాటం’ నినాదంతో సీఐటీయూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలో భారీ వేతన ఒప్పందాలను సాధిస్తున్న సంఘాల్లో సీఐటీయూ ముందంజలో ఉందని పేర్కొన్నారు. కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకత్వం సీఐటీయూదేనని, కార్మికుల కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండే సంఘంగా సీఐటీయూ కొనసాగుతోందని అన్నారు.
సీఐటీయూలో చేరిన వారిలో సాంబయ్య, ప్రవీణ్‌రెడ్డి, జయరాజు, సిద్ధార్థ, స్వయనాయక్, వీరేశం, హరిహరన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సదాశివరెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.