prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 1:30 pm Digital Edition : MAHESH MEDCHAL

జాతీయ రహదారిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

జాతీయ రహదారిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ
వాహనదారులు, పాదచారుల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు జాతీయ రహదారిపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసన వెదజల్లుతూ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మురుగునీటిలోంచి వాహనాలు వెళ్లాల్సి రావడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నడిచే పాదచారులు కూడా మురుగు నీటిని తప్పించుకుంటూ అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, పొంగిపొర్లుతున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.