జర్నలిస్టు సంజయ్ కుమార్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకుడు బద్దం నరసింహారెడ్డి

ఘట్కేసర్, ఆగస్టు 2: ఘట్కేసర్ మండలం అన్నజిగూడలోని ఆర్థిక కాలనీలో  కిడ్నీలు విఫలమై తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జర్నలిస్టు సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్దం నరసింహారెడ్డి మానవతా దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న సంజయ్ కుమార్ గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పనిచేయక తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బద్దం నరసింహారెడ్డి ఆదివారం ఆయన...