**
మన ప్రజావాణి మందమర్రి
ఆగస్టు 16
జర్నలిస్టుల ఐక్యత, వృత్తి పరమైన సహకారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పట్టణంలో నూతనంగా కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్వతీ రాజేష్ కుమార్ తెలిపారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడుగా పార్వతి రాజేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొమ్ము రాజేష్, ప్రధాన కార్యదర్శిగా రామ్ వేణు, కోశాధికారిగా తెల్ల విజయ్ కుమార్, గౌరవ సలహాదారుడిగా కనపర్తి రమేష్, ఉపాధ్యక్షులుగా మదాసు కుమార్,గరిగే సుమన్, ఎగుడ రాయమల్లు, జాయింట్ కార్యదర్శులుగా మాసు రాకేశ్, కంది రాజేశం, కాగితపు శ్రీనివాస్, న్యాయ సలహాదారుడిగా అడిచెర్ల నాగేందర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జీవన్ కుమార్, పిఆర్ఓ, క్లబ్ ఇంచార్జ్ లుగా బీరం రవి లను ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈసందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పార్వతీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ను జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి బాధ్యతాయుతంగా తీసుకెళ్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని, వృత్తి విలువలను కాపాడుతూ* క్లబ్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు. కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు కావడంతో స్థానిక జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.