prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:38 am Digital Edition : PRAJA VANI

జన్మదిన వేళ దిలీప్‌కుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మిత్రబృందం సందడి

*జన్మదిన వేళ దిలీప్‌కుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మిత్రబృందం సందడి*

*_సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్న దిలీప్‌కుమార్‌కు మున్సిపల్ చైర్మన్ బస్వం అప్ప, 18వ వార్డు ప్రతినిధి జమాల్‌పూర్ చందూలాల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు_*
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 19:
12వ వార్డు కౌన్సిలర్ కల్యాణ్‌కర్ దిలీప్‌కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బస్వం అప్ప, 18వ వార్డు ప్రతినిధి జమాల్‌పూర్ చందూలాల్, అరుణ్, గంగాధర్ తదితర మిత్రబృందం దిలీప్‌కుమార్‌ను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దిలీప్‌కుమార్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని, 12వ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
దిలీప్‌కుమార్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకోవాలని మిత్రబృందం కోరుకుంది. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వం అప్ప, 18వ వార్డు ప్రతినిధి జమాల్‌పూర్ చందూలాల్, అరుణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.