జగ్గారెడ్డి జోలికి వస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు
సంగారెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి ఆగస్టు :11
*సంగారెడ్డి కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం*
*చింతా ప్రభాకర్ పై నిప్పులు చెరిగిన నేతలు*
2017లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ అయినందుకే నాపై కేసీఆర్, హరీష్ రావు కక్ష పెటుకున్నారని నిన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే జగ్గారెడ్డిపై పాస్ పోర్టు కేసు అయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కౌంటర్
కేసీఆర్, హరీష్ రావులు చంపేస్తారని 2018లో సెంటిమెంట్ రాజేసి జగ్గారెడ్డి గెలిచారని ఎమ్మెల్యే చింతా ఆరోపణ
జగ్గారెడ్డి ఎప్పుడు గెలిచినా అసైన్డ్ భూములు కబ్జా చేస్తారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఎమ్మెల్యే చింతా వ్యాఖ్యలకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల కౌంటర్ యోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కి సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల కామెంట్స్ ఎం.ఎల్.ఎ భార్య పేరుపై 8 ఎకరాల సీలింగ్ భూమి రిజిస్ట్రేషన్ చేసి అమ్మింది నిజం కాదా చింతా దళితుల భూమి లాక్కున్నాడు…ఆయన తమ్ముడు సదాశివపేలో రోడ్లు కబ్జా చేశాడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్న ఇల్లు సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మాలకుంట కబ్జా చేసి కట్టాడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వల్ల ఓ మహిళ కుటుంబం నాశనం అయ్యింది మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళ కౌన్సిల్ సభ్యులని ఏం చేశావో గుర్తులేదా జగ్గారెడ్డిని ఏమన్నా అంటే ఖబర్దార్ మేము చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా సదాశివపేటలో ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం వార్డు మెంబర్ గా గెలవని వారు, జగ్గారెడ్డి మోచేతి నీరు తాగిన వారు ఆయన గురించి మాట్లాడుతున్నారు రేపటి నుంచి BRS నాయకుల పనిలోనే ఉంటాం…మీ అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం హరీష్ రావు మెప్పు పొందాలంటే ఆయన ఇంటిదగ్గరికి వెళ్లి పని చేయండి IIT, ఇంటింటికి మంజీరా నీరు, సంగారెడ్డి నుంచి లింగంపల్లి వరకు 4 లేన్ల రోడ్డు వేయించింది జగ్గారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీ, పీజీ కాలేజీ తెచ్చింది జగ్గారెడ్డి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చింది జగ్గారెడ్డి ఈ సమావేశం లో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారయణ, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు మహేష్, చిరు, శ్రీకాంత్, రమేష్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.